రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేటలో సమస్య పరిష్కారం అయిందని మునిసిపల్ చైర్మన్ భాష తెలిపారు. ఎన్. ఎస్. పేట రామసముద్రం రోడ్డు మసీదు వద్ద నీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యపై అటవీ ఇంధన భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేయగా మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ అలీం భాష వైకాపా జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్ షరీఫ్, కౌన్సిలర్ యండి. అమ్ము కలసి రహదారి పై నుంచి మసీదు వెనుక నుంచి పుంగమ్మ చెరువులోకి వర్షపు నీటిని తరలించేందుకు పైపులైన్లు ఏర్పాటును పరిశీలించారు. అదే విధంగా ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నిధులు రూ. 5 లక్షలతో జరుగుతున్న బీడి కాలనీలోని మజిద్ ఏ సుబాన్ కమ్యూనిటి భవనం పనులను వారు పరిశీలించారు.