శ్రీశైల జలాశయంలో నీటి నిలువలు నిలకడగా నమోదయ్యాయి. ఆదివారం జలాశయానికి ఎటువంటి ఇన్ ఫ్లో, కట్ ఫ్లో లేకపోవడంతో నీటి నిల్వలను స్థిరంగా ఉన్నాయి. దీంతో ఆదివారం ఉదయం 6 గంటలకు నీటి లెక్కలు కొలిచే సమయానికి ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్ధ్యం 215. 807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 43. 4775 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. అదేవిధంగా గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గానూ 823. 20అడుగుల నీటిమట్టం నమోదైనట్టు డ్యామ్ అధికారులు పేర్కొన్నారు. కాగా నీటి ఆవిరి రూపంలో 49 క్యూసెక్కుల నీరు ఆవిరై పోతున్నట్లు డ్యాం అధికారులు అంచనా వేశారు.