ఛత్తీస్గఢ్ రాజ్ భవన్ లో గవర్నర్ అనుసూయ ఉయికేను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎంపి విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఉయికే, ఎంపీ విజయసాయిరెడ్డి తమ తమ రాష్ట్రాలకు చెందిన సమకాలీన, వివిధ అంశాలకు సంబందించి చర్చలు జరిపారు. గవర్నర్ ఉయికే తన రాజ్యసభ ఎంపీ పదవీ కాలానికి సంబంధించిన స్వీయ-రచన పుస్తకాన్ని, జ్ఞాపికను ఎంపీ విజయసాయిరెడ్డికి అందించారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.