అశ్వాపురం మండలం గౌతమీనగరంలో జులై 1 నుంచి జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఒడిషాకు చెందిన ఉత్కల్ ఫఠాఘర్ ఆధ్వర్యంలో ఏటా ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. రథయాత్ర గౌతమీ నగరంలోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గుండిచాఘర్ వరకు కొనసాగుతుంది. జగన్నాథ స్వామి తొమ్మిది రోజులు గుండిచాఘర్లో కొలువుంటారు. 2 నుంచి 9వరకు నిత్యపూజలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. 9న గుండిచాఘర్ నుంచి బాహుడా యాత్ర కొనసాగుతుంది. అంటే జగన్నాథస్వామి తిరుగు ప్రయాణం అవుతారు.