సాంకేతికత సేవలను ఎంత సులువుగా మార్చేసింది. దాలోని లోపం వల్ల అన్నే కష్టాలుంటాయని మరోసారి రుజువు చేసింది. కుప్పలుగా బ్యాగ్‌లు.. వేలాది సంఖ్యలో షూట్ కేసులు.. ఇది ఓ ఎయిర్‌పోర్టులో దృశ్యాలు. వీటిని చూసిన నెటిజన్లు నివ్వెరపోతున్నారు. సంబంధిత ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఈ పరిస్థితి ఏర్పడింది. శనివారం ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్-2లోని బ్యాగేజీ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ప్రయాణికులకు సంబంధించిన సూట్‌కేసులు, బ్యాగ్‌లు వేలాది సంఖ్యలో ఇలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ప్రత్యేక సిస్టమ్ ద్వారా కాకుండా వారి వారి లగేజీని తీసుకెళ్లేందుకు అక్కడే అనుమతి లేదు. దాంతో అక్కడ బ్యాగ్‌లు ఇలా పేరుకుపోయాయి. ఈ కారణంతో ప్రయాణికులు విమానాశ్రయం నుంచి బయటపడేందుకు చాలా నిరీక్షించాల్సి వచ్చింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిపై విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. పైగా వారు తమ లగేజీని పొందడానికి రెండు రోజులు పట్టవచ్చని వారికి తెలియజేశారు. " టెర్మినల్-2 బ్యాగేజీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దానిని పరిష్కరించాం. మేము వీలైనంత త్వరగా ప్రయాణికులకు వారి లగేజీని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ప్రయాణాలకు అంతరాయం ఏర్పడినందుకు మమ్మల్ని క్షమించండి." అని ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి వెల్లడించారు. ఇదిలావుంటే హీత్రో విమానాశ్రయం యూకేలో అతిపెద్దది. నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రపంచంలోనే ఏడో రద్దీగా ఉండే విమానాశ్రయం ఇదే.
విసుగు చెందిన ప్రయాణికులు నేలపై ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసిన ఓ ప్రయాణికుడు "విమానాశ్రయంలో టెర్మినల్-2లోని అన్ని బ్యాగేజ్ బెల్ట్‌లు పని చేయడం మానేశాయి." అని ఒక వెల్లడించాడు. ఇక చేసేది లేక.. ప్రయాణికులు అక్కడ నుంచి తమ లగేజీని తీసుకెళ్లకుండా వెళ్లాల్సి వచ్చింది.