అత్తమీద కోపం దుత్తమీద అన్నట్లుగా ఎన్సీపీ, కాంగ్రెస్ పైనున్న కోపం కాస్త శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ నాయకుడు ఉద్దవ్ ఠాక్రే పై చూపారు. మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి తీసుకు వచ్చిన శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు సూరత్ నుంచి అసోం వెళ్లిపోయారు. ముంబాయిలో కుర్చుని లబోదిబో అంటున్న శివసేన పార్టీ నాయకులు రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతున్నాయి. ఇదే సమయంలో శివసేన రెబల్ నాయకులు వేసిన డైలాగ్ తో ఇంతకాలం శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్, ఎన్సీపీ నాయకుల మతిపోయింది.
అసోంలో ఉన్న రెబల్ నాయకులు మాత్రం మాకు మా సొంత పార్టీ శివసేన నాయకులతో ఎలాంటి విభేదాలు లేవని, ఇంత జరగడానికి కారణం కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులే అని బాంబు పేల్చారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు అనే టైపులో సామెత చెప్పిన శివసేన రెబల్ నాయకుడు కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన మంత్రుల మీద మండిపడ్డారు. ఇలాంటి చెత్త మంత్రులు, నాయకులతో వేగలేక విసిగిపోయి సొంత పార్టీ మీద తిరుబాటు చేశాము అని అసలు మ్యాటర్ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు చెందిన నాయకులు షాక్ అయ్యారు.
ఓ ప్రముఖ టీవీ చానల్ తో శివసేన పార్టీకి చెందిన మంత్రి సందీపన్ భమర్ మాట్లాడారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు అనే టైపులో సామెత చెప్పిన శివసేన రెబల్ నాయకుడు సందీపన్ భమర్ సీఎం ఉద్దవ్ ఠాక్రే మా నాయకుడే అయినా కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన మంత్రులు మేము చెప్పిన ఏ పని చెయ్యడం లేదని, మా ఎమ్మెల్యేల (శివసేన) నియోజక వర్గాలకు నిధులు మంజూరు చెయ్యడం లేదని మండిపడ్డారు.
ఎంత చెప్పినా, ఎంత వేడుకున్నా కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు చెందిన మంత్రులు మా మాట వినలేదని, ఇలాంటి చెత్త మంత్రులు, నాయకులతో వేగలేక విసిగిపోయి సొంత పార్టీ మీద తిరుబాటు చేశాము అని శివసేనకు చెందిన రెబల్ మంత్రి సందీపన్ భమర్ ఆ మీడియా చానల్ కు అసలు మ్యాటర్ చెప్పడం కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు షాక్ అయ్యారు.