ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నాయి. వీటిత ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోనూ రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్రలోనూ, ముఖ్యంగా ముంబై నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేగాక, ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఇప్పటికే భారీ వర్షాలతో అస్సాంలో లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 70 మందికిపైగా మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రాగల మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కిందిస్థాయి గాలులు నైరుతి దిశ నుంచి ఏపీ, తెలంగాణ వైపు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రానున్న మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా తీరం వెంట పెను గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. చేసింది.