అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అటెండెన్స్ ఆధారంగా అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కు పంపితేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. రూ.2 వేలు కోత అనేది పాఠశాల నిర్వాహణ కోసం ఖర్చు చేస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.