సోమవారం రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేయనున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఆయనకు మద్దతుగా టీఆర్ ఎస్ తరపున మంత్రి కేటీఆర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.