అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పోలీస్, రెవెన్యూ, వైద్య, మున్సిపల్ శాఖ అధికారులు , యువతను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల వాడకాన్ని నియంత్రిస్తూ, యువతను చిత్తు చేస్తున్న మత్తు వ్యసనాలను సమాజం నుంచి తరిమికొట్టాలని కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ పి జాషువా ఐపీఎస్ ఆదేశాల పై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్ నుండి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నందు అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకట రామాంజనేయులు , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ అస్మా పరహిన్ , ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్విడి ప్రసాద్ , ట్రైనింగ్ ఐపీఎస్ జగదీష్ అడహల్లి , ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.