ప్రముఖ వ్యాపారవేత్త, షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) కన్నుమూశారు. సోమవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వాణిజ్య, వ్యాపార రంగాల్లో చేసిన కృషికి గాను 2016లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ, వ్యాపారరంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.