మహారాష్ట్రంలో శివసేన పార్టీ తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే మంగళవారం కీలక ప్రకటన చేశారు. అస్సాం గువాహటిలో మీడియాతో మాట్లాడారు. రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి త్వరలో ముంబైకి రానున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు కూడా ఆయనకే జై కొట్టినట్లు తెలుస్తోంది. ఇక ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని సుప్రీంకోర్టులో తన పిటిషన్లో ఆయన స్పష్టం చేశారు.