ప్రముఖ పాత్రికేయుడు, ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ జుబైర్ అరెస్టుపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ప్రపంచంలో ఎక్కడైనా జర్నలిస్టులకు వారి భావాలు వ్యక్తీకరించే స్వేచ్చనివ్వాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు.
వారిపై కేసులు పెట్టి జైలు పాలుచేయడం సరికాదన్నారు. పాత్రికేయులు రాసే విషయాలపై ఎవరీ నియంత్రణా ఉండకూడదని గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ దుజార్రిక్ మంగళవారం స్పష్టంచేశారు.