చిత్తూరు జిల్లా: పలమనేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నవ వధువు అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామంలోని యువకుడితో 20 రోజుల కిందట వివాహమైంది. వధువు, వరుడు ఇద్దరూ సంతోషంగా ఉంటుండగా వధువు కనిపించకుండా పోయింది.
ఇంటి నుంచి ఇప్పుడే వస్తానని చెప్పి బుధవారం వెళ్లిన ఆమె ఎంతకు తిరిగి రాలేదు. దీంతో వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.