ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్ గెలవావాలని చూస్తోంది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లేకపోవడంతో బ్యాటింగ్ భారమంతా పుజారా, కోహ్లీపై పడనుంది. బౌలింగ్ భారమంతా బుమ్రా, షమీలపై ఉంటుంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఆ జట్టుపై గెలవాలంటే టీమిండియా బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.