భోపాల్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో జూన్ 28న ఓ వ్యక్తి ప్రయాణించాడు. ఆ వ్యక్తి ట్రైన్ లో టీ ఆర్డర్ చేసాడు. టీ కోసం రూ.20 చార్జ్ చేసింది ఐఆర్‌సీటీసీ. అయితే సర్వీస్ ఛార్జ్ పేరిట ఏకంగా రూ.50 తీసుకుంది. కేవలం సింగిల్ ఛాయ్‌కు రూ.70 ఆ ప్రయాణికుడి నుంచి వసూలు చేసింది. ఈ విషయంపై నిలదీస్తూ సోషల్ మీడియాలో అతను చేసిన పోస్ట్ వైరల్ అయింది. దీంతో ఐఆర్‌సీటీసీ రూల్స్ మేరకే వ్యవహరించామని, ఎలాంటి అదనపు ఛార్జ్ వసూలు చేయలేదని స్పందించింది.