ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్యలాల్ ను దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రియాజ్ అత్తారీ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌కు ముంబై ఉగ్రదాడులతో సంబంధం ఉందని తేలింది. నవంబర్ 26, 2011న ముంబైలో జరిగిన ఉగ్రదాడిని సమర్థిస్తూ రియాజ్ బైక్ కు RJ 27 AS 2611 నంబర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అతను 26/11 నెంబర్ కోసం రూ. 5 వేలు చెల్లించాడట.