కర్నూలు: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదని నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్చార్జి గౌరు చరిత అన్నారు.
శుక్రవారం కర్నూలు నగరంలోని గౌరు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సామాన్యులను అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు చేరవేర్చే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజలపై రూ. 1, 500 కోట్ల మేర భారం మోపడం సరైంది కాదన్నారు.