సెప్టెంబర్ 27నుంచి తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ ఈవో వెల్లడించారు.కరోనా కారణంగా 2ఏళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి తక్కువ ఉండడంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలై అక్టోబరు 1న గరుడసేవ,2న బంగారురథం,4న మహారథం,5న చక్రస్నానంతో ఉత్సవాలు ముగిస్తాయని తెలిపారు.