బీజేపీ సహకారంతో మహారాష్ట్ర కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండేకు షాక్ ఇచ్చారు ఉద్దవ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు గానూ షిండేను తొలగిస్తున్నట్లు అధికారిక స్టేట్మెంట్ విడుదల చేశారు.షిండేను శివసేన పార్టీకి సంబంధించిన అన్ని పదవుల్లో నుంచి తొలగిస్తున్నట్లు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు చీఫ్ ఉద్దవ్ ఠాక్రే.ఇప్పటికే షిండే పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నందును ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్ నాథ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన షిండే కొత్త సీఎం అని, కొత్త ప్రభుత్వం నుండి తాను తప్పుకుంటానని, తన స్టాండ్ మార్చుకుని డిప్యూటీ సీఎం అవుతానని ఫడ్నవీస్ అదే రోజు సాయంత్రం ప్రకటించారు. తన పార్టీ ప్రోద్బలంతో ఈ పని చేస్తున్నట్లు తెలిపారు.
దక్షిణ ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ షిండే.. డిప్యూటీ ఫడ్నవీస్‌తో ప్రమాణం చేయించారు.నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షిండే, థానే జిల్లాలో తన రాజకీయ గురువు, దివంగత శివసేన నాయకులు బాల్ థాకరే, ఆనంద్ డిఘేలకు నివాళులర్పించి ప్రమాణ స్వీకారం చేశారు.కొత్త ప్రభుత్వం తమ మెజారిటీని నిరూపించుకునేందుకు జూలై 2 నుంచి మహారాష్ట్ర శాసనసభ రెండు రోజుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.