తమిళనాడు తిరునల్వేలిలోని 2 వేల ఏళ్ల నాటి నేలాయప్పర్ గాంధీమతి అమ్మన్ ఆలయం ఉంది. ఇక్కడ గాంధీమతి అనే ఏనుగు 39 ఏళ్లుగా సేవలందిస్తోంది. ఆ ఏనుగు ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో భక్తులు స్పందించారు. రూ.12 వేలు ఖర్చు చేసి తోలు చెప్పులు చేయించారు. దానిని తాజాగా ఆ ఏనుగుకు బహుమతిగా అందజేశారు. కీళ్లనొప్పులతో బాధపడుతున్నందను పాదరక్షలు చేయించినట్లు వారు చెప్పారు.