సోంపు తింటే ఈస్ట్రొజెన్ హార్మోన్ పని తీరు మెరుగై పాలిచ్చే తల్లుల్లో పాలు సమృద్ధిగా తయారవుతాయి. భోజనం చేశాక సోంపు తింటే ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. రోజూ సోంపు తింటే శ్వాస తాజాగా ఉంటుంది. సోంపు రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యను, ఉబ్బస వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. సోంపుతో రక్తం శుద్ధి అయ్యి చర్మం కాంతివంతమవుతుంది.