ముఖ్యమంత్రి జగన్ బాదుడుతో ప్రజలు బాధపడుతున్నారని ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారు అని పల్నాడు జిల్లా, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. నరసరావుపేట మండలం ములకలూరు గ్రామంలో జరిగిన ప్రజా చైతన్య యాత్రలోని భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో ఆర్టీసీ చార్జీలు రెండు సార్లు,విద్యుత్ చార్జీలు ఏడు సార్లు పెంచారు. నిత్యావసర సరుకులు,పెట్రోల్,డీజిల్,ఇసుక,ఇనుము,సిమెట్,మద్యం ధరలు,రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుకుంటూ పోయిన ఘనత సీఎం జగన్ కె దక్కుతుంది. డీజిల్ చేస్,టోల్ ఫీజు, సేఫ్టీ సెస్ తదితర పేరుతో వసూలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను గాలికి వదిలేసింది. ఆర్టీసీ భూములు కబ్జాకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కార్మికుల ఆరోగ్యం పై భరోసా ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నీరు గారుస్తూ,ప్రజల పై పన్నుల భారం మోపుతోంది అని ఆవేదన వ్యక్త పరిచారు.