సత్యసాయి: మడకశిర మండలం జక్కెపల్లికి చెందిన రైతు రంగస్వామి(48) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి రెండు ఎకరాల పొలం ఉంది. ఇటీవల చెరువులో నీరు వచ్చి చేరడంతో మల్బరీ పంట నీట మునిగిపోయింది. బోరుబావులు తవ్వడానికి రూ. 3 లక్షలు అప్పు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa