డోన్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న కమిషనర్ కేఎన్ఎల్ రెడ్డి పుత్తూరుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కర్నూలు నుంచి డోన్ మున్సిపల్ కమిషనర్ గా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డోన్ మున్సిపాలిటిని అభివృద్ధి పధంలో నడిపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.