శ్రీశైల జలాశయం నుంచి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. ప్రస్తుతం జలాశయానికి ఎటువంటి ఇన్ ఫ్లో లేనప్పటికీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులు, నీటి ఆవిరి రూపంలో 55 క్యూసెక్కుల చొప్పున నీటి వినియోగం జరుగుతుంది. దీంతో మంగళవారం ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్ధ్యం 215. 807 టీఎంసీలకు గాను 43. 9570 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి.