మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ తల నరికి చంపిన వారికి తన ఇల్లు, ఆస్తులను బహుమతిగా ఇస్తానని తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మేర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి వివాదాస్పద వీడియోను విడుదల చేశాడు. వీడియో వైరల్ అయిన తర్వాత ఆ వ్యక్తిని సల్మాన్ చిస్తీగా పోలీసులు గుర్తించారు. అతడిని త్వరలో అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.