గుంటూరు, కర్లపాలెం: ఎంపీ రాజుపాలెం గ్రామంలో మంగళవారం దొంగతనం జరిగింది. గ్రామంలోని ఓ దుకాణానికి ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి విస్తరాకులు కావాలని అడిగారు. దుకాణదారుడు లోపల ఉన్న విస్తరాకు తెచ్చేలోపు గల్లాపెట్టె లో ఉన్న లక్ష తీసుకుని అక్కడి నుంచి ఆ యువకులు ఉడాయించారు. ఈ సంఘటనపై బాధితుడు కర్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa