గుంటూరు జిల్లాలో కరోనా కేసులు బుధవారం భారీగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 42 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా గుంటూరు 23, గుంటూరు రూరల్ 3, మంగళగిరి టౌన్ 3, మంగళగిరి రూరల్ 4, పెద్దకాకాని 2, తాడేపల్లి7 చొప్పున వైరస్ బారిన పడ్డారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.