కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 వ తేదీ నుండి జరగనున్న రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరిలో కార్పోరేషన్ కార్మికులు గురువారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని నినాదాలు చేశారు. ర్యాలీలో మంగళగిరి నగర కార్మికులు వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.