గత వారం రోజులుగా మహారాష్ట్ర రాజకీయం జాతీయంగా సంచలనం సృష్టిస్తూనే ఉంది. 'మహా' ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దెబ్బకు పదవి కోల్పోయిన ఉద్ధవ్ థాకరేకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. థానేకు చెందిన శివసేన కార్పొరేటర్లు 66 మంది ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గ్రూపులో చేరారు. అయితే ప్రస్తుతం ఉద్దవ్ తో ఉన్న ఎమ్మెల్యేలలో పలువురు షిండే క్యాంపునకు చేరే అవకాశం ఉందని మహా విశ్లేషకుల అంచనా.