ఏలూరు జిల్లా గుండుగోలనుకుంట గ్రామంలో పూర్ణ జశ్వంత్(9) అను బాలుడు బుధవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ అక్కడే ఉన్న ఓ బోరు బావిలో పడిపోయాడు. 400 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో 30 అడుగుల లోతులో ఓ రాయిపై చిక్కుకున్నాడు. స్థానికులు తాళ్ళ సహాయంతో బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అది వీలుకాకపోవడంతో స్థానిక యువకుడు సురేష్ తన నడుముకి తాడు కట్టుకొని బోరుబావిలో దిగి బాలుడిని పైకి లాగి రక్షించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa