బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా బోరిస్‌కు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బోరిస్‌కు వ్యతిరేకంగా 40 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. తన ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవి రేసులో రిషి సునక్ ఉన్నారు. ఈయన భారతీయ సంతతి వ్యక్తి కావడం విశేషం.