రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామ వైసీపీ నేతలు హాజరై వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు అందించిన సంక్షేమ పాలనను తిరిగి మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లో అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమం లో పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పాటిబండ్ల సత్యనారాయణ , శ్రీ పాటిబండ్ల శ్రీనివాసరావు, రెడ్డిగూడెం మండలం వై ఎస్ ఆర్ సి పి మండల అధ్యక్షులు శ్రీ బలగాని తిరుపతి రావు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa