మంత్రాలయం: మంత్రాలయం మండల పరిధిలోని మాలపల్లి గ్రామంలో శుక్రవారం వైసీపీ నేతల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు సీతారామిరెడ్డి, రాముడు, గురురాజరావులు మాట్లాడుతూ రాజకీయ నేతలకు వైఎస్ఆర్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. వైఎస్ఆర్ విలువలకు చక్కటి నిర్వచనమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa