దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైయస్ఆర్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ-గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8-9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైయస్ఆర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్లీనరీకి బయలుదేరారు. నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైయస్ఆర్సీపీ ప్లీనరీలో వారు పాల్గొననున్నారు.