చాలా మంది పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సమయం టీవీలు, ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీనేజీ పిల్లల విషయంలో ఇది మరింత ప్రమాదకరమని తాజా పరిశోధనలో తేలింది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తూ ఎక్కువసేపు గడపడం, మొబైల్ గేమ్స్ కి అతుక్కుపోవడం వల్ల టీనేజీ పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా చూస్తుంటే మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.