సీఎం వైఎస్ జగన్ రోల్‌మోడల్ అని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. గుంటూరులో శుక్రవారం ప్రారంభమైన వైసీపీ ప్లీనరీలో ఆమె మాట్లాడారు. జగన్ ఏపీలో, షర్మిళ తెలంగాణలో వేర్వేరు పార్టీలతో ప్రజల్లో ఉన్నారన్నారు.
తన కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందని, ఆమెకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇద్దరు బిడ్డలకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.