నాన్న మీ జీవితమే నాకు స్ఫూర్తి అంటూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ఇవాళ వైఎస్సార్ 73వ జయంతి. ఈ సందర్భంగా ఇడుపులపాయలో తండ్రి స్మారక ఘాట్ వద్ద సీఎం జగన్ ఘననివాళులు అర్పించారు. అనంతరం ట్విట్టర్ లో భావోద్వేగభరితంగా స్పందించారు. అభిమానుల చిరునవ్వుల్లో తండ్రిని చూసుకుంటున్నానంటూ పేర్కొన్నారు.
"నాన్నా... మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరిశ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం" అంటూ ట్వీట్ చేశారు.