కార్యకర్తలు & నాయకులతో.. ప్రకాశంలో టిడిపి జరిపిన మహా మహానాడును చూసి దానికి మించి.. చేతిలో వున్న అధికారంతో వైసీపీ సత్తా చాటాలని కసిగా అనుకొంది అని టీడీపీ నాయకులూ తెలియజేసారు. వైసీపీ ప్లీనరీ సభని ఉద్దేశించి మాట్లాడుతూ... మా బస్సు యాత్రలు తుస్సుమన్నాయని.. గడప గడపలో నిలదీస్తున్నారని పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేసింది.. మేమూ ప్లీనరీ నిర్వహించి మా సత్తా చాటి చూపుతాం మీరే చూస్తారని అరివీర సవాళ్లు విసిరారు. అంతటితో ఊరుకోలేదు. ఏకంగా జగన్ రెడ్డి కలగజేసుకొని దిశానిర్దేశం చేసాడు. పార్టీలో పెద్దరెడ్లు & సత్తిబాబు గట్రాలతో.. ఇటీవలే ఒక సమావేశం పెట్టుకొని విజయవంతం చెయ్యడానికి ఒకరికి ఒకరు బాధ్యతలు నిర్దేశించుకొన్నారు. మహానాడులో జరిపే బ్లడ్ డోనేషన్ నుండి భోజనాల నిర్వహణ వరకు కమిటీలు వేసుకోవడం వరకు మక్కీకి మక్కీ కాపీ కొట్టి.. మొట్టమొదటి సారిగా మహానాడు లెక్కన సత్తాచాటాలని ఉవ్విళ్లూరారు. మహానాడు అయినా.. ప్లీనరీ అయినా కార్యకర్తలు & నాయకులు కీలకం. ఏకంగా టిడిపి ఆఫీసు & చంద్రబాబు ఇంటి మీదే దాడి చేస్తే మన వైకాపా దాడుల దెబ్బకు టిడిపి కకావికాలం అవుతుందని, ప్రకాశంలో మహానాడుకు అనుమతి ఇవ్వక వేధించి.. స్థలం కూడా దొరకకుండా చివరివరకు సతాయించి.. వాహనాలు రాకుండా అడ్డుకొని, వచ్చిన వాటికి గాలి తీయించి ఆర్టీసీ బస్సులు కూడా అద్దెకు దొరకకుండా అడ్డుకున్నారు. అయినా.. కసిగా ఏకమయ్యారు కార్యకర్తలు.. ఒంగోలును సునామీలా చుట్టి.. టిడిపి నాయకుల్లో ధైర్యాన్ని నింపారు మహానాడును విజయవంతం చేసి కానీ వైకాపా కార్యకర్తలు ఎక్కడిక్కడ స్థానిక మినీ ప్లీనరీలలో మొహం చాటేశారు. అయినా.. జగన్ పాల్గొనే రాష్ట్ర ప్లీనరీకి పెద్దఎత్తున నాయకులతో కలిసి కార్యకర్తలు వస్తారని ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. కానీ రాష్ట్ర ప్లీనరీని మరింత అట్టర్ ప్లాప్ చేస్తూ.. షాక్ ఇచ్చారు అని తెలియజేసారు.