వైయస్ఆర్ సీపీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నిన్న జరిగిన ప్లీనరీ సభలో అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్లీనరీ వేదికపై నుంచి వైయస్ఆర్ సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని ప్రకటించారు. శనివారం సాయంత్రం అధ్యక్ష స్థాన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ రాజ్యాంగానికి సంబంధించి రెండు, మూడు సవరణలు కూడా ఉంటాయని తెలిపారు. రెండో రోజు వైయస్ఆర్ సీపీ ప్లీనరీలో పలు తీర్మానాలు చేయనున్నారు. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేయనుంది. తొలిరోజు ప్లీనరీలో 4 రంగాలపై తీర్మానాలు చేశారు. మహిళ సాధికారత , దిశ చట్టం.. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు.. డిబిటి పథకాలు అమలుపై ప్లీనరీ తీర్మానాలు చేసింది.