దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని అండిపట్టి పాఠశాలలో గురు, శుక్ర వారాల్లోనే 31 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతేకాదు 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ పాఠశాలను మూసి వేసి, మిగతా విద్యార్థులకు పరీక్షలు చేయిస్తోంది.