ఏపీలో విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల షార్ట్ మెమోల్లో ఏవైనా తప్పులు ఉంటే సవరణల కోసం డీజీఈ కార్యాలయానికి తీసుకురావాలని డీజీఈ డి.దేవానంద రెడ్డి శుక్రవారం తెలిపారు.తద్వారా ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లలో ఆ దోషాలు ఉండకుండా చూసుకోవాలని కోరారు. తప్పుల సవరణల కోసం హెచ్‌ఎం నామినల్ రోల్స్‌కు జత చేసిన పాఠశాలల రికార్డులను, హెచ్‌ఎం అటెస్ట్ చేసిన షార్ట్ మెమో కాపీని జూలై 18 తేదీలోగా అందజేయాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa