తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిడుమల్ ఆవారాంగాడు ప్రాంతంలో దారుణం జరిగింది. సుధ అనే మహిళతో సెల్వరాజ్ (50) అనే వ్యక్తి ఐదేళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల మరో వ్యక్తితో సుధ సన్నిహితంగా ఉండడాన్ని సెల్వరాజ్ ప్రశ్నించాడు. దీంతో గురువారం రాత్రి సెల్వరాజ్‌ను ఆమె ఇంటికి పిలిపించింది. బాగా మద్యం తాగించి, చీరతో గొంతు నులిమి హత్య చేసింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.