పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరులో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటికిటలాడింది. ఆదివారం మరియు తొలి ఏకాదశి పండుగ పర్వదినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నారు. స్వామికి నూగుల పిండి, చలి పిండి, పానక పందారాలను నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తుల కొరకు తగు ఏర్పాట్లు చేశారు.