కేబినెట్ హోదా కలిగిన పయ్యావుల కేశవ్ కి భద్రత తొలగించడం వెనక ఏమి కుట్ర పన్నిన్నారు జగన్ రెడ్డి అని పలమనేరు టీడీపీ నాయకులూ అమర్నాధ్ రెడ్డి తెలియజేసారు. ఈ విషయం పై స్పందించి మాట్లాడుతూ... ప్రజల తరపున మీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకా, పెగాసస్ పోన్ ట్యాపింగ్ కు సంబందించి మీ బండారం బట్టబయలు చేసినందుకా? అని ప్రశ్నించారు. మా టీడీపీ ప్రభుత్వంలో, భద్రత కల్పించకుంటే ఆనాడు నీవు పాదయాత్ర చేసే వాడివా??.. టీడీపి నాయకులను అంతమొందించాలనే నీ కుట్ర ఫలించదు.. ఎన్నో రోజులు అధికారంలో ఉండవు అది గుర్తు పెట్టుకో అని హెచ్చరించాడు.