అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం, వయోజనుడైన ఒక వ్యక్తి సగటున ఒక వారంలో 150 నిమిషాలపాటు మధ్యస్థ స్థాయి ఏరోబిక్ వ్యాయామాలు చేయటం మంచిది. లేదంటే 75 ని.పాటు కఠోర ఏరోబిక్ యాక్టివిటీ చేయవచ్చు. అంటే నిత్యం కనీసం 30 ని. చొప్పున వారంలో కనీసం 5 రోజులు చేయాలి. హైకింగ్, స్విమ్మింగ్, నృత్యం, జంపింగ్ రోప్, బ్రిస్క్ వాకింగ్ ఇవన్నీ ఏరోబిక్స్ కిందకే వస్తాయి.