ఓ కాంగ్రెస్ నేత దారుణంగా హత్యకు గురయ్యారు. కర్ణాటక కలబురగి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలి భర్త గిరీశ్ కంబనూరును(42) దుండగులు పదునైన ఆయుధాలతో నరికి చంపారు. షాహబాద్ రైల్వేస్టేషన్ కు సోమవారం గిరీశ్ టికెట్ రిజర్వేషన్ కోసం వచ్చిన సమయంలో దుండగులు దాడి చేశారు. కత్తులతో పొడిచి, నరికి పారిపోయారు. కాంగ్రెస్ నేత అక్కడికక్కడే చనిపోయారు. గతంలో గిరీశ్ సోదరుడు సతీశ్ కూడా ఇలానే హత్యకు గురయ్యారు.