ఛత్తీస్‌గఢ్‌లోని ఖమత్రాయ్లో శివాజీనగర్ హైస్కూల్ లో పదోతరగతి విద్యార్థి మోహన్ సింగ్ రాజ్‌పుత్ ఫ్రెండ్స్ తో కలిసి పరీక్ష రాయడానికి వెళ్లాడు. పరీక్ష ముగిశాక బయటకు వచ్చిన మోహన్‌కు అతడి సీనియర్లకు చిన్నవిషయంలో గొడవ జరగగా కోపంతో సీనియర్లు మోహన్‌ను చితకబాదారు. వెంటనే అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న మిగతా విద్యార్థులు మోహన్‌ను ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతడు మృతి చెందాడు.