బీహార్లోని కోపా పోలీస్ స్టేషన్ పరిధి సారన్ ప్రాంతంలో సోమవారం దారుణం జరిగింది. లాలీ(3) అనే చిన్నారిని బతికుండగానే తల్లి శ్మశానంలో పాతిపెట్టింది. బాలికను స్థానికులు రక్షించి, పోలీసులకు సమాచారం అందించారు.
తల్లిదండ్రుల పేర్లు రాజుశర్మ, రేఖాదేవిగా బాలిక చెబుతోంది. తన నోట్లో తల్లి, నానమ్మ కలిసి మట్టి కుక్కారని, తర్వాత శ్మశానంలో పాతిపెట్టారని బాలిక పేర్కొంది. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.